Several People Died in Road Accident in Suryapet District : ఇసుక లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఐదుగురు వలస కూలీలు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారీ క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు.
మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర ప్రమాదం - దంపతులతో పాటు కుమార్తె స్పాట్ డెడ్
VIRAL VIDEO : యూటర్న్ తీసుకునేటప్పుడు జాగ్రత్త - లేదంటే మీకూ ఇలాగే జరగొచ్చు!