కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్ పెద్దపెల్లి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్కు మద్దతుగా జిల్లా కేంద్రంలోని అన్ని వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.
ఆర్టీసీ బస్సులు, ఇతరత్రా వాహనాలు కూడా నడవకపోవడంతో ప్రధాన కూడళ్లు, రహదారులు బోసిపోయాయి. పెద్దపల్లితో పాటు సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండల కేంద్రాల్లో బంద్ స్వచ్ఛందంగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోన్న బంద్