ETV Bharat / state

Bandi Sanjay: 'మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పినట్లు నిరూపిస్తే క్షమాపణలు చెబుతా'

Bandi Sanjay: అవినీతిపై విచారణ భయంతోనే ప్రధానిపై కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం సెంటిమెంట్‌ను రగిలించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సభలో ప్రధాని మోదీ, భాజపాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పినట్లు నిరూపిస్తే క్షమాపణలు చెబుతానన్నారు.

Bandi Sanjay: 'మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పినట్లు నిరూపిస్తే క్షమాపణలు చెబుతా'
Bandi Sanjay: 'మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పినట్లు నిరూపిస్తే క్షమాపణలు చెబుతా'
author img

By

Published : Feb 12, 2022, 10:46 PM IST

Bandi Sanjay: యాదాద్రి భువనగిరి జిల్లా సభలో ప్రధాని మోదీ, భాజపాపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అవినీతిపై విచారణ భయంతోనే ప్రధానిపై కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం సెంటిమెంట్‌ను రగిలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలకు ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్‌ తాపత్రయ పడుతున్నారని సంజయ్‌ విమర్శలు గుప్పించారు.

చెల్లని రూపాయి..

కేసీఆర్ అవినీతిపై విచారణ జరగబోతోంది. తన పని ఖతమైందని గ్రహించి తెలంగాణ సెంటిమెంట్​తో రాజకీయ లబ్ది పొందే కుట్రలో భాగమే నరేంద్రమోదీపై ఆరోపణలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ సమాజమంతా అసహ్యించుకుంటోంది. దీనిపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నరు. కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచమంతా ప్రశంసిస్తే.. కేసీఆర్ ఫాంహౌజ్​కే పరిమితమై పారాసిటమాల్ సీఎంగా విమర్శల పాలైండు. కేసీఆర్ చెల్లని రూపాయి. రైతు చట్టాలను పొగిడి... ఇప్పుడు విమర్శిస్తుండటం సిగ్గు చేటు.

-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

దిల్లీ దండాలు.. ఇక్కడ తిట్లు

నాడు లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ నిర్ణయాన్ని కేసీఆర్‌ కొనియాడారని.. ఇప్పుడు ఆ నిర్ణయం తప్పని విమర్శిస్తున్నారని.. ఆయన ప్రధానిని పొగిడిన సంగతే మర్చిపోయాడన్నారు. దిల్లీలో మోదీకి దండాలు.. ఇక్కడ తిట్టడం కేసీఆర్‌కు అలవాటైందన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఏనాడైనా చెప్పిందా అని ప్రశ్నించారు. మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పినట్లు నిరూపిస్తే క్షమాపణలు చెబుతానన్నారు. కాంగ్రెస్‌- తెరాస చీకటి ఒప్పందం ఇవాళ బయటపడిందన్న బండి సంజయ్​.. కేసీఆర్‌ రాహుల్‌గాంధీకి అనుకూలంగా మాట్లాడటమే అందుకు నిదర్శనమన్నారు.

సవాల్​ను స్వీకరించాలి..

వ్యవసాయ బోర్లకు కరెంటు మీటర్లు పెట్టాలని కేంద్రం ఏనాడైనా చెప్పిందా? నీకు దమ్ముంటే.. నీకు చిత్తశుద్ధి, నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే నా సవాల్​ను స్వీకరించాలి. కేంద్రం ఎప్పుడైనా బోర్లకు మీటర్లు పెట్టాలని చెప్పినట్లుగా నిరూపిస్తే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధం. కాంగ్రెస్-తెరాస చీకటి ఒప్పందం ఈరోజు బయటపడింది. ఈరోజు సభలో కాంగ్రెస్​కు, రాహుల్ గాంధీకి అనుకూలంగా మాట్లాడటమే ఇందుకు నిదర్శనం. పార్లమెంట్​లోనూ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి తెరాస సభ్యులకు పదేపదే సపోర్ట్ చేశారు. డిస్కంలకు రూ.48 వేల కోట్లు బాకీ ఎందుకు పెట్టిండో కేసీఆర్ సమాధానం చెప్పాలి.

-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

'మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పినట్లు నిరూపిస్తే క్షమాపణలు చెబుతా'

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.