పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలోని బౌద్ధ స్తూపం వద్ద హిందూ దేవతలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అక్కడే ఉన్న కొంతమంది హిందువులు ప్రతిజ్ఞ చేయించిన వారితో వాగ్వాదం చేశారు. స్వేరోస్ పేరుతో మతప్రచారం చేస్తున్నారంటూ.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రతిజ్ఞకు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్కు సంబంధం లేదని.. అతనికి తెలియకుండా జరిగిందని నచ్చజెప్పే యత్నం చేశారు.