పెద్దపెల్లి జిల్లా మంథని మండలం లక్కెపూర్ గ్రామ శివారులోని ట్రాన్స్ ఫార్మర్ దగ్గర ఎర్తింగ్ వైర్‌కు కరెంటు సప్లై కావడంతో 3 ఎద్దులు మృతి చెందాయి. గుమ్మునూరు గ్రామానికి చెందిన మొతె శంకర్‌కు చెందిన రెండు ఎడ్లు, మరొకటి అదే గ్రామానికి చెందిన జంజర్ల శ్రీనివాస్ కు చెందినదిగా గుర్తించారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన ఇద్దరు రైతులకు సుమారు లక్షా 50 వేల రూపాయల నష్టం జరిగిందని గ్రామ సర్పంచ్ మిట్ట సత్యనారాయణ అన్నారు. విద్యుత్ శాఖ ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి సాయం అందించాలని, లేకుంటే రైతులతో కలసి సబ్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి.. మిత్రులతో ఆ పని చేయాలని భార్యను వేధించి...