పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పాల్గొన్నారు. నిజామాబాద్ జడ్పీ కార్యాలయంలోని మొక్కలకు నీరు పోసి, పరిసరాలను పరిశుభ్రం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలను పరిశుభ్రంగా ఉంచుంకొని.. డెంగీ, కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పడాలన్నారు.
ఇవీ చూడండి: కులవృత్తులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం: తలసాని