ETV Bharat / state

సివిల్స్​కు ప్రిపేర్​ అవుతున్నారా? అయితే యువ అధికారుల సూచనలివే!!

author img

By

Published : Mar 16, 2022, 1:49 PM IST

సివిల్ సర్వీస్‌ ఉద్యోగం అనేది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి ప్రతి ఒక్కరి కల.... అలాంటి ఉద్యోగాలకు ప్రిపరేషన్ అనేది చాలా కష్టతరమైంది. దానికి కోసం సంవత్సరాలు తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. వీటి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తుంటారు. ఇటువంటి వారికోసం సలహాలు సూచనలు ఇస్తున్నారు. యువ సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు...అవేంటో ఇప్పుడు చూద్దాం.

young civil services officers suggestions for civils exams
సివిల్స్​కు ప్రిపెర్​ అవుతున్నారా? అయితే యువ అధికారుల సూచనలివే!!
సివిల్స్​కు ప్రిపేర్​ అవుతున్నారా? అయితే యువ అధికారుల సూచనలివే!!

దేశంలోని వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో అత్యున్నత ఉద్యోగాలకు.... ఎంపిక సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా జరుగుతుంది. అటువంటి పరీక్ష కోసం ఏటా లక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. కానీ విజయం కొందరినే వరిస్తుంది. అలా ఎంపికైన యువ సివిల్‌సర్వీస్‌ అధికారుల బృందం.... శిక్షణలో భాగంగా నిజామాబాద్ పర్యటనకు వచ్చారు. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ప్రిపరేషన్‌లోని మెళకువలతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చారు.

ప్రస్తుతం పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు మరికొన్ని రోజుల్లో జరగబోయే ప్రిలిమ్స్ కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మెుదలు పెట్టండి. బేసిక్‌ సబ్జెక్టులైన హిస్టరీ, జాగ్రఫీ , పాలిటీ, ఎకానమీ, ఇన్విరాన్‌మెంటల్‌.... వీటిని బాగా రివీజన్‌ చేయడం ఉత్తమం. ఒక ఏడాది కరెంట్‌ అఫైర్స్‌ను ప్రిపేరవ్వాలి. ఇలా చదువుతూ..... పరీక్షకు నెల రోజుల ముందే సిలబస్‌ని పూర్తి చేసుకుని... కేవలం రివీజన్‌ పైనే దృష్టి పెట్టాలి.

విశాల్ ఝవేరి, ఐఆర్టీఎస్ అధికారి

రాష్ట్ర స్థాయిలో గ్రూప్‌వన్.... జాతీయ స్థాయిలో సివిల్‌సర్వీసెస్‌ లాంటి పరీక్షల్లో పెద్దగా మార్పులేమీ ఉండవు. సిలబస్‌ పరంగా రెండు సమానంగా ఉంటాయి. వీటి కోసం మార్కెట్లో చాలా పుస్తకాలు దొరుకుతాయి. అన్నీ తీసుకోని అభ్యర్థులు ఇబ్బంది పడకుండా. ప్రామాణిక పుస్తకాలను మాత్రమే ఎంచుకోవాలని, అప్పుడే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని యువ అధికారులు సూచిస్తున్నారు.

సివిల్స్‌ అభ్యర్థులు ముందుగానే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. పరీక్షల్లో విజయం సాధించడానికి రాత్రి, పగలు కష్టపడాలి. నేను యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుని.... రోజులో కనీసం 10గంటల పాటు చదివే వాడిని. ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలో కూడా ముందుగానే సమయాన్ని విభజించుకునే వాడిని, సాధ్యమైనంత వరకు మెుబైల్‌కు దూరం ఉంటూ.... సమయాన్ని ఆదా చేసేవాడిని.

కిరణ్, జగదల్‌పూర్, ఎస్పీ

విద్యార్థులు ముందు సిలబస్‌ని ఒకటికి రెండు సార్లు చదువుకోని దానిపై పట్టు సాధించాలి. అప్పడే ప్రిపరేషన్‌ చాలా సులభం అవుతుంది. ఆన్‌లైన్‌లోని కోన్ని స్టాండర్డ్‌ వైబ్‌సైట్ల ద్వారా మెటిరియల్‌ సైతం లభిస్తున్నాయి. ప్రతి రోజు కరెంట్ ఆఫైర్స్ నోట్స్ రాసుకోని...వాటిని నెలవారీగా మళ్లీ రివీజన్‌ చేసుకోవాలి.

అసలు మీరెందుకు సివిల్‌ సర్వీస్‌లోకి రావాలనుకుంటున్నారో ముందుగానే ఆలోచించుకోవాలి. ముందు వచ్చే సమస్యల్ని అధిగమిస్తూ పరీక్షలకు సిద్ధం కావాలి. సివిల్స్‌కు ప్రిపరవ్వాలంటే చాలా ఓపిక కావాలి. ఎందుకంటే చాలా మంది ప్రిలిమ్స్, మెయిన్స్‌లో విఫలమవుతుంటారు. దానిలో దృష్టిలో ఉంచకుండా... నిబద్ధతతో కట్టుబడి లక్ష్యం కోసం పనిచేయాలి.

రాకేష్ కుమార్, ఐఆర్టీఎస్ అధికారి

యూపీఎస్సీ లాంటి జాతీయ సర్వీసులకు సన్నద్ధమయ్యే విద్యార్థులు తప్పక సమయపాలన పాటించాలి. రోజులో కనీసం 8 గంటల పాటు చదివే విధంగా ప్రణాళిక చేసుకోవాలి. అభ్యర్థులు మెుదటి నుంచే మెయిన్స్ పై దృష్టి సారించాలి. వీటితో పాటు ముఖ్యమైన సబ్జెక్టులపై ముందునుంచే ప్రత్యేక శ్రద్ధ వహించాలని సలహా ఇస్తున్నారు.

రోజుకు ఎన్ని గంటలు చదవాలో ముందుగానే నిర్ణయించుకునేవాడిని కాదు. ఒక రోజు 8 గంటలు చదివితే మరొక రోజు తక్కువ చదివుతూ ఆ సమయాన్ని మరొక రోజుకు భర్తీ చేసేవాడిని, ఇలాంటి పరీక్షలకు ప్రణాళిక అనేది చాలా అవసరం, ఎలాంటి బుక్స్‌ చదవాలి, ప్రత్యేకంగా సిలబస్‌ మీద దృష్టి సారించాలి. ఎంత చదివామన్నది కాకుండా తక్కువ సమయంలో ఎలా చదవాలో చూడాలి. ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

శైలేష్ మీనా, ఐఎఫ్ఎస్ అధికారి

ముఖ్యమైన సబ్జెక్టులకు నోట్స్ రాసుకోని వీలైనన్ని సార్లు రివీజన్‌ చేసుకోవాలి.ఎప్పటికప్పుడు ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకోవాడానికి సాధ్యమైనంత వరకు మాక్‌ టెస్టులు రాయాలి. గత సంవత్సర పరీక్ష ప్రతాలను ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే వాటి స్థాయి ఎంటానేది తెలుస్తుందని సలహా ఇస్తున్నారు.

పుస్తకాలను చదవడానికి నేను కంప్యూటర్‌ను ఉపయోగించాను. అలాగే ఆడియో క్లీప్స్‌ వినడం, యూట్యూబ్‌, ఇంటర్నెట్‌లో వెతకడం లాంటి వాటితో చదువుకునేవాడిని. ఒక్కోసారి చాలా కష్టమయ్యేది కానీ ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంది. అందువల్ల నాకు చదవడం సులభమయ్యింది. లేదంటే చాలా ఇబ్బందులు పడేవాడిని.

రాకేష్ శర్మ, ఐఆర్ఎస్ అధికారి

సివిల్ సర్వీసెస్‌ లాంటి అత్యున్నత ఉద్యోగాల కోసం దివ్యాంగులు సైతం పోటీ పడుతున్నారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో చాలా రకాల మెటీరియల్స్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతో మేము సైతం అంటూ వారికొచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఉద్యోగాలను సాధించాలంటే ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించుకోని...లక్ష్యం కోసం పని చేయాలి. ఎప్పుడూ ఒత్తిడికి లోనుకాకుడదు. పరీక్షలకు కొన్ని రోజుల ముందు నుంచి చదవడం ఆపేసి..రివీజన్‌పై దృష్టి సారించాలి. మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే విజయం సులభమవుతుందని యువ అధికారులు అంటున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.