నిజామాబాద్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు, అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని కలెక్టర్ మైదానం నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. భూమండలం నుంచి ప్లాస్టిక్‌ను తరిమి కొట్టాలని కలెక్టర్ పులునిచ్చారు. ప్రతి ఒక్కరు సహకారం కావాలన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహస్థులు, వారి వారి కార్యాలయాల్లో, పాఠశాల్లో, వీధుల్లో ఇతర స్థలాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో తగ్గించాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం చేపట్టాలన్నారు.
ఇవీ చూడండి: జడ్పీ స్థానాలు... ఎవరికి దక్కేనో...?