నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కీర్తి సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో బుధవారం ఒకే కాన్పులో ఇద్దరూ మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల జన్మించారు. ఆస్పత్రి స్త్రీ వైద్య నిపుణులు డా. ప్రేమలత తెలిపిన వివరాల ప్రకారం.. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన హర్షితకు గంట పాటు శస్త్రచికిత్స చేయగా... ముగ్గురు పిల్లలు ఆరోగ్యవంతంగా జన్మించారు.
ఉదయం 11:44 గంటలకు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి: హోం ఐసోలేషన్‌కు కాలనీవాసుల అభ్యంతరం