ETV Bharat / state

భార్యకు పిల్లలు పుట్టలేదని భర్త ఏం చేశాడో తెలుసా..?

author img

By

Published : Jul 1, 2020, 5:19 PM IST

పిల్లలు పుట్టలేదని భార్యను పుట్టింటికి పంపించాడు. ఇదే అదునుగా మరో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన ఆ ఇల్లాలు అత్తారింటి ముందు ధర్నాకు దిగింది.

wife did not have children husband decide another marriage at nizamabad
భార్యకు పిల్లలు పుట్టలేదని భర్త ఏం చేశాడో తెలుసా

భార్యకు పిల్లలు పుట్టలేదని వదిలేసి మరో వివాహానికి సిద్ధమయ్యాడో వ్యక్తి. నిజామాబాద్ జిల్లా కాలూరుకు చెందిన మహిళకు వేల్పూర్ మండలం మోతేకు చెందిన జడల నగేశ్​తో 2006లో వివాహం జరిగింది. కొంతకాలం వారి దాంపత్య జీవితం సజావుగానే కొనసాగింది. కానీ ఇటీవల పిల్లలు పుట్టడం లేదనే సాకుతో ఆమెను హింసించసాగాడు. సంవత్సరం క్రితం ఆమెను కొట్టి పుట్టింటికి పంపించాడు. కుల సంఘాల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ ఆమెను తీసుకురాలేదు.

న్యాయం చేయాలని డిమాండ్

కొన్ని రోజుల క్రితం నగేశ్​ రెండో వివాహం చేసుకున్నాడని ఆమెకు తెలిసి అత్తవారింటి ముందు 10 రోజులుగా ధర్నాకు దిగింది. అత్తింటివారు ఇంటికి తాళం వేసుకుని చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న నిజామాబాద్ హ్యూమన్ రైట్స్ మహిళా సంఘాల సభ్యులు, తదితరులు మోతే గ్రామానికి చేరుకుని ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుల సంఘాల పెద్దలు, గ్రామస్థులు బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చూడండి : దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : చాడ వెంకట్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.