నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భర్త ఇంటి వద్ద భార్య ధర్నాకు దిగింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మెట్టాడిపల్లికి చెందిన కీర్తికి మూడేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కసాబ్గల్లికి చెందిన వినయ్‌తో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి భర్త తనను వేధింపులకు గురిచేసేవాడని బాధితురాలు తెలిపింది. వినయ్‌కి వేరే యువతితో వివాహేతర సంబంధం ఉందని.. ఆరోపించింది. వేధింపులు భరించలేక కొన్నాళ్లు పుట్టింటికి వెళ్లిపోయానని బాధితురాలు పేర్కొంది.
తిరిగి ఇంటికొస్తే తాళం వేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు కదలనని భర్త ఇంటి వద్దే ఆందోళనకు దిగింది.
ఇదీ చదవండి: వామన్‌రావు దంపతుల హత్య కేసుపై ప్రభుత్వానికి గవర్నర్ లేఖ