ETV Bharat / state

శ్రీరాంసాగర్​ నుంచి యాసంగికి నీరు విడుదల - శ్రీరాంసాగర్​ నుంచి యాసంగికి నీరు విడుదల

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్​ జలాశయం నుంచి యాసంది పంటల సాగుకోసం అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రధాన కాలువల ద్వారా వారబందీ పద్ధతిలో విడుదల చేయనున్నామని అధికారులు తెలిపారు.

water released from sriram sagar project
శ్రీరాంసాగర్​ నుంచి యాసంగికి నీరు విడుదల
author img

By

Published : Dec 25, 2019, 4:54 PM IST

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ జలాశయం నుంచి యాసంగి పంట సాగుకు కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ యాసంగిలో దిగువ మానేరు కింద 4 లక్షల ఎకరాలకు, సరస్వతి కాలువ కింద 35వేల ఎకరాలకు, లక్ష్మి, హన్మంత్​ రెడ్డి ఎత్తిపోతల పథకాల కింద 33 వేల ఎకరాలకు నీటిని విడుదల చేయడానికి అధికారులు ప్రణాళిక రచించారు. రైతులు పొదుపుగా వాడుకోవాలని... నీటిని కాలువల ద్వారా వారబందీ పద్ధతిలో (8 రోజుల విడుదల, 7 రోజుల నిలుపుదల) విడుదల చేయనున్నామని ప్రాజెక్టు ఈఈ రమేశ్​ తెలిపారు. ఏప్రిల్ 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని విడుదల చేయమని... కాలువల చివరన ఉన్న రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

శ్రీరాంసాగర్​ నుంచి యాసంగికి నీరు విడుదల

ఇవీ చూడండి: పెరిగిన కాళేశ్వరం ఆరో ప్యాకేజీ పనుల అంచనా వ్యయం

Intro:నిజాంబాద్ జిల్లా లోని శ్రీరాంసాగర్ జలాశయం నుంచి యాసంగి పంట సాగు కొరకు నేటి ఉదయం ప్రధాన కాలువ లైన కాకతీయ లక్ష్మీ సరస్వతి కాలువల ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు ఈ యాసంగి లో దిగువ మానేరు కింద 4 లక్షల ఎకరాలకు సరస్వతి కాలువ 35వేల ఎకరాలకు లక్ష్మీ హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాల కింద 33 వేల ఎకరాలకు నీటిని విడుదల చేయడానికి అధికారులు ప్రణాళిక రచించారు

Body:ప్రాజెక్టు ఈఈ ఓ పి రమేష్ మాట్లాడుతూ రైతులు పొదుపుగా వాడుకోవాలని నీటిని కాలువల ద్వారా వారబందీ పద్ధతిలో ఎనిమిది రోజుల విడుదల ఏడు రోజుల నిలుపుదల పద్ధతిలో లో లో విడుదల చేయనున్నామని ఏప్రిల్ 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని విడుదల చేయమని కాలువల చివరన ఉన్న రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.