నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద త్రివేణి సంగమం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రవాహంతో త్రివేణి సంగమం అయినటువంటి కందకుర్తి వద్ద గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి.

గోదావరిలోని శివాలయం నీట మునిగింది. శివుని తలపై గంగమ్మ చేరినట్టుగా అక్కడి ప్రదేశం చూపరులను ఆకట్టుకుంటుంది. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- ఇదీ చూడండి: నిండుకుండలా మారిన పులిచింతల డ్యామ్