ETV Bharat / state

Andolana: మా భుములిచ్చాం.. మాకు ఉపాధి కల్పించండి..! - నిజామాబాద్ వార్తలు

నిజామాబాద్​లోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ కోసం తమ భూములిచ్చినా ఉద్యోగాల ఊసే లేదని డిచ్​పల్లి మండలం నడ్​పల్లి తండా వాసులు ధర్నా చేపట్టారు. తమకు జీవవోపాధి కల్పించి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

villagers dharna in front of telangana university
నిజామాబాద్​లోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఎదుట స్థానికులు ఆందోళన
author img

By

Published : Oct 20, 2021, 3:47 PM IST

తమకు ఉపాధి కల్పించాలంటూ నిజామాబాద్​లోని తెలంగాణ విశ్వవిద్యాలయం ముందు డిచ్​పల్లి మండలం నడ్​పల్లి తండా వాసులు ధర్నా చేపట్టారు. యూనివర్శిటీ కోసం తమ భూములు ఇస్తే.. ఉద్యోగాల ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అర్హతకు తగినట్లుగా ఏ ఉద్యోగమిచ్చినా పనిచేస్తామని తెలిపారు. దయచేసి తమకు జోవనోపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

విశ్వవిద్యాలయం కోసం తమ జీవనాధారమైన భూములను కోల్పోయామని వాపోయారు. ఇటీవల కొత్తగా వచ్చిన వీసీని కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగాలు రాకుండా కొందరు విద్యార్థి నాయకులు అడ్డుకుంటున్నారని తండా వాసులు ఆరోపించారు. విద్యార్థులకు మా ఉద్యోగాలతో పనేంటని నిలదీశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగాలు కల్పించాలని నడ్​పల్లి తండావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇంతకముందే మేం వీసీని అడిగాం. ఇదివరకే పదిమందిని తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడేమో మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మమ్మల్ని కాదని ఇతరులను తీసుకుంటున్నారు. మా భూములు ఇచ్చి ఉపాధి కోల్పోయాం. మాకు ఏదో ఒక పని కల్పించాలి. మాకు జీవనోపాధి కల్పించేదాకా పోరాటం చేస్తాం. మాకు న్యాయం జరగాలే. లేని యెడల మా భూములు మాకు ఇవ్వాలే. -నడ్ పల్లి తండా వాసులు, నిజామాబాద్ జిల్లా

ఇదీ చూడండి:

KTR: హైదరాబాద్‌లో త్వరలో ఎయిరో స్పేస్ డిఫెన్స్ యూనివర్శిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.