సురేష్ ఇంటికొచ్చి ఎవరెవరు గొడవ చేశారో విచారిస్తాం: సీఐ వెంకటేశ్వర్లు - nizamabad family suicide in vijayawada
Nizamabad family suicide: నిజామాబాద్‌కు చెందిన సురేష్ కుటుంబం ఆత్మహత్య కేసులో విజయవాడ పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. సురేష్ ఇంటికి వచ్చి ఎవరెవరు గొడవ చేశారో విచారిస్తామని సీఐ చెప్పారు. ఫోన్ కాల్స్, సెల్ఫీ వీడియో, వాయిస్ మెసెజ్‌లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు.
Nizamabad family suicide: నిజామాబాద్‌కు చెందిన సురేష్ కుటుంబం ఆత్మహత్య కేసులో విజయవాడ పోలీసులు విచారణ ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో సురేష్ ఇంటిని పోలీసులు పరిశీలించారు. గంగాస్థాన్ ఫేజ్-2లోని 207 ఇంటిని పరిశీలించిన విచారణ బృందం.. సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకొంది. అనంతరం అపార్టుమెంట్లో నివాసముండేవారని ప్రశ్నించారు. విజయవాడ ఒకటో పట్టణ పీఎస్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. సురేష్ ఇంటికి ఎవరెవరు వచ్చి గొడవ చేశారో విచారిస్తామని సీఐ చెప్పారు. ఫోన్ కాల్స్, సెల్ఫీ వీడియో, వాయిస్ మెసెజ్‌లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. రెండు బృందాలుగా విచారణ చేస్తున్నామని.. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని చెబుతోన్న విజయవాడ ఒకటో పట్టణ సీఐ వెంకటేశ్వర్లుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ జరిగింది?
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిజామాబాద్‌కు చెందిన ఓ కుటుంబం బలవన్మరణం చెందింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణానదిలో దూకారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ వీధిలో శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రంలోని 3వ ఫ్లోర్‌లో ఈనెల 6వ తేదీని.. పప్పుల అఖిల్ పేరిట తెలంగాణ నుంచి వచ్చిన ఒక కుటుంబం గది తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుంచి శ్రీ రామ ప్రసాద్ అనే వ్యక్తి సత్రానికి ఫోన్ చేసి తన తన బావ సురేశ్ అప్పుల బాధతో చనిపోతున్నట్లు సమాచారం అందించారు. రాత్రి రెండున్నర గంటలకు తన బావ వద్ద నుంచి ఈ మేరకు వాయిస్ మెసెజ్‌లు వచ్చాయని తెలిపాడు. దీంతో సత్రం సిబ్బంది సురేశ్ కుటుంబం ఉన్న గదికి వెళ్లి చూడగా... అప్పటికే ఇద్దరు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు పప్పుల సురేష్(56), పప్పుల శ్రీలత కాగా...వారి కుమారులు 28 ఏళ్ల అఖిల్, 22 ఏళ్ల ఆశిష్‌గా గుర్తించారు.
ఇవీచూడండి: