విద్యార్థుల్లో జీవిత నైపుణ్యాలను పెంపొందించేందుకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని ఎక్లార గేటు వద్ద గల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గత 13 రోజులుగా వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 218 గురుకుల పాఠశాల నుంచి 421 మంది విద్యార్థులు ఈ శిబిరానికి వచ్చారు. వారికి వివిధ అంశాలపై శిక్షకులు బోధిస్తున్నారు. విద్యార్థులకు కథలు, న్యూస్ రిపోర్ట్, సినిమా, ఆంగ్లంలో మాట్లాడటం నేర్పిస్తున్నారు. సమ్మర్ సమురాయ్ పేరుతో నిర్వహించే శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆటలు, చిత్రలేఖనం, క్రీడలు, వ్యాయామం ఇలా కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. ఆంగ్లభాషపై ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు. నిత్య జీవితంలో జరిగే సంఘటనలను, తదితర అంశాలు తెలియజేస్తున్నారు. 19 మంది శిక్షకులు శిబిరంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: భూమి ఒకరిది... పాస్ పుస్తకాలు మరొకరికి