నిజామాబాద్ జిల్లా బోధన్‌లో రెండు ఫంక్షన్ హాళ్లను కరోనా నియంత్రణ కమిటీ అధికారులు సీజ్ చేశారు. కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వివాహాలకు 200 మంది మించకుండా ముందు జాగ్రత్త నోటీసులు జారీ చేశారు. అయితే వాటిని బేఖాతరు చేసినందుకు బోధన్ కరోనా నియంత్రణ కమిటీ ఆగ్రహించింది. కొత్త రమాకాంత్, రవి గార్డెన్ ఫంక్షన్ హాళ్లను మూసివేశారు.
ఇదీ చూడండి: సరిహద్దుల మూసివేతతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం