ETV Bharat / state

Two Boys Died After Falling Into Water Pit Nizamabad : ఆడుకుంటూ వెళ్లి.. నీటి గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి - బాల్కొండలో నీటి గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి

Water Pit
Two Boys Died After Falling Into Water Pit
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 4:02 PM IST

Updated : Sep 7, 2023, 5:41 PM IST

15:58 September 07

Two Boys Died After Falling In Water Pit Balkonda : బాల్కొండ మండలంలో నీటి గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి

Two Boys Died After Falling Into Water Pit Nizamabad : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్​పేటలో విషాదం చేటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఇద్దరు బాలురు శరణ్​ (4), నాస్తిక్​ (5) మృతి చెందారు. వీడీసీ భవనం నిర్మాణం కోసం గుంతలు తవ్వగా.. అందులో వరదనీరు చేరింది. ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఆ గుంతలో పడి మృత్యువాత పడ్డారు. అయితే గత మూడ్రోజుల నుంచి కురిసిన వాన వల్లే ఆ గుంతలో వరదనీరు చేరిందని.. అది గమనించని బాలురు ఆడుకుంటూ వెళ్లి అందులో పడ్డారని స్థానికులు చెబుతున్నారు.

Two Boys Died After Falling In Water Pit Balkonda : అయితే తెలంగాణ వ్యాప్తంగా గత మూడ్రోజులు భారీగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలోనూ మూడ్రోజులు ఏకధాటి వాన కురిసింది. ఈ వానకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రైల్వేస్టేషన్, బస్టాండ్, వీక్లీ మార్కెట్, బోధన్ రోడ్డు సహా పలు రహదారులు వాన నీటితో నిండిపోయాయి. అలాగే రోడ్​సైడ్ ఉండే గుంతల్లో కూడా నీళ్లు చేరాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల దృష్ట్యా నిజామాబాద్‌ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో మూడు రోజుల నుంచి పిల్లలు ఇంట్లో నుంచి బయటకి కూడా రాలేదు.

Rains in Telangana : శాంతించని వరుణుడు.. జోరు వానలతో ఆగమవుతున్న తెలంగాణ

Boys Died After Falling In Rainwater Pit Nizamabad : కాస్త వర్షం తగ్గుముఖం పడడంతో ఆడుకునేందుకు ఇవాళే బయటకు వస్తున్నారు. అలాగే తమ స్నేహితులతో కలిసి ఆడుకుందాం అని ఇవాళ శరణ్, నాస్తిక్​లు కూడా బయటకు వచ్చారు. అలా తమ ఫ్రెండ్స్​తో ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందారు. వారు గుంతలో పడటం గమనించిన మిగతా పిల్లలు తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. వెంటనే వారంతా అక్కడికి చేరుకుని పిల్లలను బయటకు తీశారు. కానీ అప్పటికే బాలురిద్దరూ ఊపిరాడక మృతి చెందారు. అయినా కొన ప్రాణాలతో ఉన్నారేమోనన్న ఆశతో వారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

Heavy Rains in Hyderabad Today : భారీ వర్షానికి వణికిన భాగ్యనగరం.. మూసారంబాగ్‌ బ్రిడ్జి మూసివేత

అక్కడ వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందారని తెలిపారు. నీటిగుంతలో పడటం వల్ల ఊపిరాడక.. నీరంతా ఊపిరితిత్తుల్లోకి చేరి మరణించారని చెప్పారు. వైద్యులు తమ పిల్లల మృతిని ధ్రువీకరించడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆడుకోవడానికి వెళ్తాన్నావనుకున్నాను కానీ.. ఇలా మమ్మల్ని వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోతావనుకులేదు చిన్నా అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

ఈ ఘటనపై స్థానికులు స్పందించారు. వర్షాలు కురిసిన ప్రతిసారి ఇలా పిల్లలు అయితే డ్రైనేజీల్లో కొట్టుకుపోవడం.. లేదా ఇలా నీటిగుంతల్లో పడి చనిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు వినిపించుకోవడం లేదని వాపోయారు. ఇప్పుడూ ఈ ఇద్దరు పిల్లల మృతికి ఆ భవన యజమాని మాత్రమే కాకుండా.. అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Boy Was Dead in Culvert at Hyderabad : బాచుపల్లి వద్ద నాలాలో గల్లంతైన బాలుడు మృతి..

Girl falls in nala: పాల ప్యాకెట్​ కోసం వెళ్తుండగా.. నాలాలో పడి చిన్నారి మృతి.. సీసీ టీవీలో దృశ్యాలు

Last Updated : Sep 7, 2023, 5:41 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.