ETV Bharat / state

పాతాళానికి పడిపోతున్న పసుపు ధరలు.. ఆవేదనలో అన్నదాతలు - పడిపోతున్న పసుపు ధరలు

Turmeric prices:వాణిజ్య పంటలైన మిర్చి, పత్తికి మార్కెట్లో రికార్డు ధరలు పలుకుతుంటే పసుపు ధరలు మాత్రం పాతాళంలో ఉంటున్నాయి. పసుపునకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్నా ఎగుమతులు పంటకు ఆశించిన స్థాయిలో ధరలు రావడం లేదు. దీనికితోడు ఈ యేడు అకాల వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడులు తగ్గగా.. చేతికొచ్చిన పంటకు సైతం మార్కెట్లో ధరలేక అన్నదాతలు ఆవేదనలో మునిగిపోయారు.

పాతాళానికి పడిపోతున్న పసుపు ధరలు.. ఆవేదనలో అన్నదాతలు

author img

By

Published : Apr 9, 2022, 4:13 AM IST

పాతాళానికి పడిపోతున్న పసుపు ధరలు.. ఆవేదనలో అన్నదాతలు

Turmeric prices: పసుపు ఉత్పత్తిలో 3.13లక్షల టన్నుల దిగుబడితో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పసుపు పంట ఎక్కువగా సాగవుతోంది. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా 50వేల ఎకరాల్లో పంట సాగవుతుంది. ఈ ఏడాది అధిక వర్షాలతో పసుపురైతులు తీవ్రంగా నష్టపోయారు. దుంపకుళ్లు రోగం వచ్చి పంట దిగుబడి బాగా పడిపోయింది. ఎకరానికి 35క్వింటాళ్లు వస్తుందనుకుంటే.. 15నుంచి 20క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. రైతులకు ఒక్కో ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర ఖర్చవుతుండగా.. కనీసం పెట్టుబడి రాని పరిస్థితి నెలకొంది. వాణిజ్య పంటలైన పత్తి, మిరపకు రికార్డు ధరలు పలుకుతుంటే.. తమ పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైందని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పసుపు ధరలు మాత్రం.. 30 ఏళ్ల క్రితం 3వేల ధర పలికిన పసుపు ప్రస్తుతం 6 వేలు పలుకుతోంది. 2010-11లో 18వేల ధర పలికిన పసుపు.. ఇప్పుడు 6 వేలే పలుకుతోంది. పెట్టుబడి ధరలు రాకపోవడం వల్లే సాగును తగ్గించుకుంటూ వస్తున్నాం. ఎరువుల ధరలు పెరుగుతున్నాయి కానీ పసుపు ధరలు మాత్రం పెరగడం లేదు. -జనార్థన్, పసుపు రైతు

ఎందుకు తగ్గిస్తున్నారు.. మిర్చి ధర రూ.55వేలు పోతోంది. పత్తి ధర రూ.10 నుంచి 12 వేల ధర పలుకుతోంది. మరి పసుపు ధరను ఎందుకు తగ్గిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. -నర్సయ్య, రైతు

గోడు వెళ్లబోసుకుంటున్న అన్నదాతలు: రాష్ట్రంలో పండిన పసుపు నిజామాబాద్, వరంగల్ మార్కెట్లతో పాటు తమిళనాడులోని ఈరోడ్, సేలం, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు వెళ్తుంది. ఎక్కువగా నిజామాబాద్‌ మార్కెట్‌కే తరలిస్తారు. ప్రస్తుతం క్వింటాకు 6నుంచి 7వేలు మాత్రమే ధర పలుకుతోంది. ఇందులో కొమ్ము అయితే 7వేల వరకు, మండ అయితే 6వేల వరకు వస్తోంది. గతేడాది 10వేలు వస్తే... ఈ సారి 7వేల రూపాయలకు మించడం లేదని అన్నదాతలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పసుపు ఎగుమతులను పెంచి మంచి ధర లభించేలా చూడాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: హస్తినలో ధర్నాకు సిద్ధమవుతున్న గులాబీ దళం.. ఏర్పాట్లు ముమ్మరం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.