Turmeric Board in Telangana 2023 : దాదాపు మూడు దశాబ్దాల కింద నిజామాబాద్‌లో పురుడు పోసుకున్న పసుపు బోర్డు(Turmeric Board) డిమాండ్ ఎన్నో పోరాటాలకు దారులు వేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ ఎజెండాగా మారింది. ఇందూరు సభలో బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్, ఆర్మూర్ సభలో రాంమాధవ్ బోర్డు హామీ ఇచ్చారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు సాధిస్తానని బాండ్ పేపర్ రాసివ్వటం చర్చనీయాంశమైంది.
MP Arvind on Turmeric Board Telangana : ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీని బీజేపీ పక్కనపెట్టినట్లు అనిపించటంతో రైతుల నుంచి నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ సందర్భంలో రెండేళ్ల కిందట సుగంధ ద్రవ్యాల బోర్డు(Spices Board) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు అయ్యేలా ఎంపీ అర్వింద్(MP Arvind) కృషిచేశారు. దీని ద్వారా పసుపు రైతులకు పలు రాయితీలు అందించినప్పటికీ ధర రాకపోయేసరికి కర్షకుల్లో అసంతృప్తి తొలగలేదు. అమిత్ షాతో పాటు ఇతర మంత్రులను విరివిగా కలుస్తూ బోర్డు ఏర్పాటు దిశగా ప్రయత్నం చేసినట్లు ఎంపీ వివరించారు.
PM Modi Tweet on Turmeric Board Telangana : 'పసుపు రైతుల కోసం మేం ఎంతవరకైనా వెళ్తాం.. ఏమైనా చేస్తాం'
PM Modi Sanctioned Turmeric Board Telangana : రాష్ట్రంలో సుమారు లక్షన్నర ఎకరాల్లో పసుపు సాగవుతోంది. గతంలో 12 లక్షల క్వింటాళ్ల పంట వస్తుండగా.. దిగుబడులు తగ్గటం, ధర లేక సాగు విస్తీర్ణం తగ్గింది. దేశవ్యాప్తంగా 20-25 శాతం సాగు విస్తీర్ణం తగ్గినట్లు ఉద్యాన శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒకే రకం విత్తన వినియోగం, పంట మార్పిడి లేక నేల స్వభావం మారింది. ఫలితంగా మందులు వాడటం అనివార్యమై వ్యయం రెండింతలైంది. 2011లో క్వింటా ధర రూ.16 వేలు రావటం మినహా పదిహేనేళ్లలో గిట్టుబాటు ధర రానేలేదు. పసుపు బోర్డు ఏర్పాటుతో సాగులో సాంకేతికత, మేలైన వంగడాలు అందుబాటులోకి ఖర్చు తగ్గుతుందని రైతులు భావిస్తున్నారు.
'రాష్ట్ర రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని నరేంద్రమోదీ ఎంతో కృషి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఒప్పించి పసుపు రైతుల చిరకాల కోరికను సాధించడం చాలా ఆనందంగా ఉంది. పసుపు రైతుల కోసం ఎంతవరకైనా వెళ్తాం అని నరేంద్ర మోదీ అనడం చాలా సంతోషం. పసుపు బోర్డును తీసుకురావడానికి మంత్రులను అనేక సార్లు కలిశాను. పార్టీలకు అతీతంగా పసుపు బోర్డు విషయంలో అందరు ఆనందిస్తున్నారు. దశాబ్దాల పసుపు రైతుల కలను నరేంద్ర మోదీ పాలమూరు సభ ద్వారా నిజం చేశారు.' -ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
PM Modi Announces Turmeric Board in Telangana : పసుపు సాగయ్యే పది ప్రముఖ రాష్ట్రాల్లో 3.30 లక్షల టన్నుల ఉత్పత్తితో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర 2.26 లక్షలతో రెండో స్థానంలో, 3.30 లక్షల టన్నులతో మూడో స్థానంలో కర్ణాటక.. తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో బోర్డు ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కోరుతున్నారు.
MP Aravind on Turmeric Board : "పార్టీలకు అతీతంగా పసుపు బోర్డు ప్రకటనపై ఆనందిస్తున్నారు"