నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఈనెల 30 వరకు ఉన్న సెలవులను మే 7 వరకు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఓ ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 60 జనరల్ అడ్మినిస్ట్రేషన్ లాక్డౌన్ నేపథ్యంలో విడుదల చేసిన జీవో ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణం, దక్షిణ ప్రాంగణం, సారంగపూర్ ప్రాంగణం, అనుబంధ కళాశాల్లో గల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలన్నింటికీ ఈ సెలవుల పొడిగింపు వర్తిస్తుందని ఆమె వివరించారు.
ఇదీ చూడండి:- జనరేటర్ ద్వారా ఇంట్లోకి విషవాయువు-వ్యక్తి మృతి