నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 18వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నిజామాబాద్ డిపో-1 వద్ద కార్మికులు పువ్వులు ఇచ్చి తమ నిరసన తెలిపారు. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లకు పువ్వులు ఇచ్చి విధులకు హాజరు కావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక ఉద్యోగం కోసం రాకుండా.. తమ సమ్మెకు సహకరించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: చిదంబరానికి ఊరట-సీబీఐ కేసులో బెయిల్