బోధన్ 38 వార్డులకు ఫలితాలు వెలువడ్డాయి. తెరాస 19 స్థానాల్లో విజయం సాధించింది. 06 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. భాజపా అభ్యర్థులు 02, ఎంఐఎం 11, స్వతంత్రులు 00 స్థానాలు దక్కించుకున్నారు. బోధన్‌లో తెరాస ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.
ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకు గానూ... తెరాస 23, కాంగ్రెస్ 01, భాజపా 06, ఎంఐఎం 01, ఇతరులు 05 స్థానాలు గెలుచుకున్నారు. ఆర్మూర్ పురపాలికలోనూ తెరాస 23 స్థానాల అధిక్యంతో ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.
భీంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 12 వార్డులు తెరాస కైవసం చేసుకుంది. మిగతా పార్టీలు ఖాతా తెరవలేదు. దీనితో భీంగల్‌లో తెరాస ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
నిజామాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ... తెరాస ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. జిల్లాలో కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.