ETV Bharat / state

తెరాస నేతల కార్లు, బైక్​లను కాల్చేసిన గుర్తుతెలియని వ్యక్తులు - land issues

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలానికి చెందిన ముగ్గురు తెరాస నేతలకు చెందిన రెండు కార్లు, ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు. దీనికి కారణం భూవివాదమేనని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

trs leaders cars fired by unknown victims

author img

By

Published : Aug 25, 2020, 10:57 AM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలంలోని నడిపల్లి గ్రామ సర్పంచ్ సతీశ్​ కారుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. డిచ్​పల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మాజీ ఎంపీటీసీ కారును సైతం దగ్ధం చేశారు. ఓ వార్డు మెంబర్ ద్విచక్రవాహనాన్ని కూడా దుండగులు పెట్రోల్ పోసి కాల్చేశారు.

ఈ ముగ్గురు నేతలు తెరాస పార్టీకి చెందిన వారే... ఈ ఘటనలకు భూ వివాదమే కారణమని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

ఇదీ చదవండి- సెప్టెంబర్​ 1 నుంచి మెట్రో రైల్​​ సర్వీసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.