మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో సర్వే నెంబర్ 551/888/4 లో ఎకరం 20 గుంటల భూమిని 1965లో, మూడెకరాల 20 గుంటల భూమిని 1971లో గ్రామానికి చెందిన బట్టు కిషన్ కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఆ భూమిని 1978లో అటవీ శాఖకు అద్దెకు ఇచ్చారు. అప్పటి నుంచి వారు సరిగ్గా అద్దె కట్టకపోవడం, ఖాళీ చేయకపోవడం వల్ల విసుగు చెందన భూ యజమానులు కోర్టును ఆశ్రయించారు. ఆగ్రహించిన కోర్టు డిక్రీ ద్వారా ఆ స్థలాన్ని ఖాళీ చేయించారు.
2013లో హైకోర్టు గిరిజనులైన భూ యజమానులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. వాటి ప్రకారం అప్పటి ఎమ్మార్వో, సర్వేయర్లు పరిశీలించి హద్దులు నిర్ణయించారు. ఆ తర్వాత భూ యజమానులు లేని సమయంలో ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ ప్రభుత్వ విశ్రాంతి గృహం, చేపల మార్కెట్ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు శంఖుస్థాపన కూడా జరిగింది. ఆ భూమి తమకే చెందుతుందని హైకోర్టు చెప్పినా.. ప్రభుత్వాధికారులు అన్యాయంగా తమ భూములు లాక్కోవడం సరికాదని గిరిజనులు ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న గిరిజనులకు సీపీఎం, కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీభావం పలికారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం