Telangana weather report: మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. బుధవారం రాత్రి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఆసిఫాబాద్‌లో భారీ వర్షం కురిసింది. బజార్‌హత్నూర్ మండలంలో పలుతండాలతోపాటు వాంకిడి, కెరమెరి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. జైనథ్, నార్నూర్ మండలాల్లో, నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. బోధన్, కోటగిరి, రుద్రూర్, మోస్రా, చందూర్, ఎడపల్లి, రెంజల్, వేల్పూర్, డిచ్‌పల్లి మండలాల్లో ఉరుములు, మెరుపులు వచ్చాయి.
అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా లోకారి గ్రామంలో 1.9 సెంటీమీటర్ల వర్షపాతం, నిజామాబాద్ జిల్లా బెల్లాల్‌లో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో మధ్యాహ్నం పూట పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ క్రమంగా పెరుగుతోంది. బుధవారం తెల్లవారుజామున నాగర్‌కర్నూల్ జిల్లా అత్యల్పంగా అమ్రాబాద్‌లో 11.4, హైదరాబాద్ శివారు హకీంపేటలో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇదీ చదవండి: rape on student in shamirpet : 9వ తరగతి విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు అత్యాాచారం