ETV Bharat / state

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి - crime news

ఒకే మండల కేంద్రంలో ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన నిజామాబాద్​ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

three people died in nizamabad district
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
author img

By

Published : May 28, 2020, 4:13 PM IST

ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో ఒకే మండల కేంద్రంలో ముగ్గురు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ధర్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్​కు కూత వేటు దూరంలో మండల కేంద్రానికి చెందిన గుడిమెల భూమయ్య (70) మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య పిల్లలు ఎవరు లేరని, రోజు ఇంటింటికి తిరిగి బిక్షాటన చేసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. మండల కేంద్రంలోని ఊర చెరువులో దుర్వాసన వస్తుండడం వల్ల స్థానికులు గమనించి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక విచారణ అనంతరం మండల కేంద్రానికి చెందిన భూమయ్యగా గుర్తించారు. మృతదేహం పరిశీలిస్తే మృతి చెంది నాలుగు రోజుల సమయం అయి ఉంటుందని ఎస్సై పాండేరావు వివరించారు. మృతుని బంధువులు కాలకృత్యాలకు చెరువులోకి వెళ్లే క్రమంలో వడదెబ్బ తగిలి అక్కడే చనిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారని ఎస్సై తెలిపారు.

ధర్పల్లి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్​లో యాచకుడిగా జీవనం సాగించే పోచయ్య(60) బుధవారం వడదెబ్బతో మృత్యువాత పడినట్లు ఎస్సై పాండే రావు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మండల కేంద్రానికి చెందిన మరో వ్యక్తి కమ్మరి స్వామి(42) కొడుకుతో కలిసి చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. తండ్రి చెరువులో నుంచి బయటకు రాకపోవడం వల్ల కుమారుడు కేకలు వేయడంతో స్థానికులు వెళ్లి బయటకు తీసే లోపు మృతి చెందినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

ఇవీ చూడండి: పోలీసులపై కత్తితో దాడికి యత్నం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.