ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ఒకే కుటుంబంలో పదిహేను రోజుల్లో ముగ్గురు మృతి

గ్రామాలు వేరైనా ఆ కుటుంబాన్ని కొవిడ్ వెంటాడింది. పదిహేను రోజుల్లో ముగ్గురుని కబళించి... ఆ కుటుంబానికి శోకాన్ని మిగిల్చింది. ఒకేసారి భర్తను, కూతురుని, మనవారిలిని కోల్పోయిన ఆ అవ్వ రోదన వర్ణనాతీతం.

three-members-died-with-corona-in-same-family-at-nizamabad
కరోనా ఎఫెక్ట్: ఒకే కుటుంబంలో పదిహేను రోజుల్లో ముగ్గురు మృతి
author img

By

Published : May 20, 2021, 10:13 AM IST

నిజమాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలం వాడి గ్రామంలో సాయవ్వ, బాలగంగారం దంపతులు నివాసముంటున్నారు. వారికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కుమార్తె లతను డిచ్​పెల్లి మండలానికి చెందిన శ్రీనివాస్​కు ఇచ్చి వివాహం చేశారు. లత కూతురు సంధ్యను ఇందల్వాయికి చెందిన రవికి ఇచ్చి పెళ్లిచేశారు.

ఈనెల 4వ తేదీని బాలగంగారం అనారోగ్యంతో మృతి చెందగా... 14వ తేదీన లత కూతురు సంధ్య కరోనా చికిత్స పొందుతూనే మగ శిశువుకు జన్మనిచ్చి మృత్యువాతపడింది. కూతురు చనిపోయిన 5 రోజులకు వైరస్​తో లత కూడా తుది శ్వాస విడిచింది. మృతులు వేరే గ్రామాల్లో ఉంటున్నా... అందరూ ఒకే కుటుంబానికి చెందిన కావటంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి: కొవిడ్ రెండో ఉద్ధృతికి జులైలో తెర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.