నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్లో స్టేట్ ఏటీఎంను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టారు. ఏటీఎంలో ఉన్న సుమారు రూ.6 లక్షల నగదును అపహరించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నేరస్థులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
- ఇదీ చూడండి : మిస్టరీ: చదువుకోవడానికి ఇంటిపైకెళ్లి శవమై తేలింది!