నిజామాబాద్ జిల్లాలో యాసంగి పంటలకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. కాకతీయ, లక్ష్మి కాలువల ద్వారా నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విడుదల చేశారు.
కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు , లక్ష్మి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. దీంతో ఆయకట్టు రైతులు యాసంగి పంట వేయడానికి సన్నద్ధం అవుతున్నారు . ఈ కార్యక్రమంలో.. మెండోరా మండల అధ్యక్షులు సుకన్య, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి , నీటి పారుదల శాఖ ఎస్ ఈ సుశీల్ కుమార్, జెన్కో ఎస్ ఈ వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'నూతన కార్పొరేటర్లతో వెంటనే పాలకమండలి ఏర్పాటు చేయాలి'