ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఇంట్లోనే చేసుకోవాలని అడిషనల్ డీసీపీ రఘువీర్ సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు, లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. పోలీసులకు ప్రజలు సహకరించి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాసినా, ఎవరినైనా దూషించినా... కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.
'ముస్లిం సోదరులు రంజాన్‌ను ఇంట్లోనే చేసుకోండి' - LOCK DOWN EFFECTS
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో డీసీపీ రఘువీర్ పర్యటించారు. లాక్డౌన్ అమలు, పోలీసులు చేపట్టిన చర్యలను డీసీపీ పరిశీలించారు. కరోనా కట్టడి కోసం పోలీసులకు ప్రజలు సహాకరించాలని సూచించారు.
'ముస్లిం సోదరులు రంజాన్‌ను ఇంట్లోనే చేసుకోండి'
ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఇంట్లోనే చేసుకోవాలని అడిషనల్ డీసీపీ రఘువీర్ సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు, లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. పోలీసులకు ప్రజలు సహకరించి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాసినా, ఎవరినైనా దూషించినా... కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.
ఇదీ చూడండి:- లాక్డౌన్ నుంచి వీటికి మినహాయింపు