నిజామాబాద్ జిల్లా మల్లారంలో అజయ్ కుమార్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో సోమవారం మృతి చెందాడు. ఉదయం పశువుల మేత కోసం మోటర్ దగ్గర గడ్డి కోసే క్రమంలో గడ్డితో పాటు విద్యుత్ తీగలు కొయ్యడంతో అజయ్ కుమార్ విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. మృతుడి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం. చేతికి వచ్చిన పెద్ద కొడుకు అజయ్.. కళ్ళ ముందే కుప్పకూలిపోవటంతో గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు చూపరులను సైతం కంట తడి పెట్టించింది. నిజామాబాద్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టమార్టం నిమిత్తం తరలించారు.
గడ్డితో విద్యుత్ తీగను కోసిన రైతు.. అక్కడికక్కడే మృతి - ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి
నిజామాబాద్ జిల్లా మల్లారంలో అజయ్ కుమార్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఉదయం పశువుల మేత కోసం మోటర్ దగ్గర గడ్డి కోసే క్రమంలో గడ్డితో పాటు విద్యుత్ తీగలు కొయ్యడంతో అజయ్ కుమార్కు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.