ETV Bharat / state

Dialysis patients problems:ఇంజక్షన్ల కొరత.. డయాలసిస్​ రోగులకు తప్పని వ్యథ - డయాలసిస్ యంత్రాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డయాలసిస్ రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డయాలసిస్ కేంద్రాల్లో సమస్యలతో పాటు సూది మందు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులకు ఇచ్చే ఎరిథ్రో పాయిటిన్ ఇంజక్షన్ సరఫరా లేక అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ యంత్రాలు సరిగా పని చేయక.. ఇతర సమస్యలతో అవస్థలు తప్పడం లేదని రోగులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు కేంద్రాలు ఉండగా.. అన్నిచోట్లా సమస్యలు వేధిస్తున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ ఇబ్బందులపై ఇటీవల రోగులు కలెక్టర్​ను కలిసి ఫిర్యాదు చేశారంటే పరిస్థితికి అద్దం పడుతోంది.

Dialysis patients problems
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డయాలసిస్ రోగుల పరిస్థితి మరింత దయనీయం
author img

By

Published : Nov 4, 2021, 10:49 PM IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూత్రపిండాల వ్యాధుల చికిత్సలో సూదిమందు కొరత ఏర్పడింది. డయాలసిస్ రోగులకు ఇచ్చే ఎరిథ్రోపాయిటిన్ ఇంజక్షన్ సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నెలన్నర రోజులుగా సమస్య నెలకొంది. స్తోమత గల రోగులు సొంతంగా బయట నుంచి కొనుగోలు చేసి వాడుతున్నారు. మిగతా వారు దేవుడే దిక్కన్నట్లు రోజులు వెళ్లదీస్తున్నారు. ఈ విషయంపై గత సోమవారం డయాలసిస్ రోగులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి, బాన్సువాడలోనూ ఇదే పరిస్థితి ఎదురవ్వగా.. ఆస్పత్రి నిధుల నుంచి వందేసి ఇంజక్షన్లు కొనుగోలు చేశారు. ఇవి కూడా వారం రోజుల్లో ఖాళీ అయ్యే దుస్థితి నెలకొంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. అత్యవసర మందులను మాత్రమే సర్కారు సరఫరా చేస్తోంది. ఇందులో ఐరన్ ఇంజక్షన్ రోగికి నెలలో రెండు ఇస్తారు. వీరికి ఎరిథ్రో పాయిటన్ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి నెలలో నాలుగు వరకు అవసరం అవుతాయి. అయితే ఎరిథ్రో పాయిటిన్ సరఫరా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి సరఫరా లేకపోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డయాలసిస్ కేంద్రాలకు ఇంజక్షన్ సరఫరా నిలిచిపోయింది. మూత్ర పిండ వ్యాధుల్లో డయాలసిస్ దశకు చేరిన వారిలో రక్త హీనత ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు ఉచితంగా అందుతున్నా ఇంజక్షన్ సరఫరా లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఇంజక్షన్​తోపాటు డయాలసిస్ కేంద్రాల్లో సమస్యలు సైతం రోగులను ఇబ్బంది పెడుతున్నాయి. సరిపడా యంత్రాలు లేక.. ఉన్న వాటిలో హెపటైటిస్ బి, సి రోగులకు యంత్రాలు తక్కువగా ఉండటం వల్ల అవస్థలు పడుతున్నారు. అలాగే చికిత్సలో ఉపయోగపడే శుద్ధజలం సమస్య సైతం ఇబ్బంది పెడుతోంది. వీటితోపాటు పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రం కావడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది రోగులకు సేవలు అందిస్తున్నామని కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. రోగులకు అవసరమైన ఇంజక్షన్ గురించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు.

పేద రోగులకు ఎంతో మేలు చేసి ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో సేవలు ఉచితంగానే అందుతున్నా.. అసౌకర్యాలు, సమస్యలు, ఇంజెక్షన్ల కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ దృష్టి సారించి పరిష్కారం చూపాలని రోగులు కోరుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డయాలసిస్ రోగుల పరిస్థితి

ఇదీ చూడండి:

Nizamabad City Buses: విస్తరిస్తోన్న నిజామాబాద్... సిటీ బస్సులు నడపాలని విజ్ఞప్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.