కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కట్టడి ప్రాంతాలు మినహా అన్ని మండలాలు, గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ప్రారంభించినట్లు నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ ప్రాంతాల్లో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు.
మొక్కల సంరక్షణ, నర్సరీల నిర్వహణను క్షేత్రస్థాయిలో సందర్శించారు. పనిచేసే చోట మాస్కులు తప్పనిసరిగా ధరించాలని.. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు పాలనాధికారి సూచించారు. గంటకు ఒక సారి చేతులు కడుక్కునేందుకు సబ్బును కానీ, శానిటైజర్‌ను కానీ అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్