విజయారెడ్డి మృతికి సంతాపంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోరా తదితర మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు మూసివేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఆయా మండలాల్లో మీసేవా కేంద్రాలను కూడా మూసివేసి ఆపరేటర్లు బంద్ పాటించారు. బాల్గొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద విజయారెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. కార్యాలయాలకు తాళం వేయడం వల్ల పనులు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: ముగిసిన తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు