ETV Bharat / state

Telangana University: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆవిర్భావ వేడుకలు - Telangana news today

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం(Telangana University)లో రాష్ట్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(telangana formation day 2021) సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి వీసీ రిజిస్ట్రార్ నసీం, ఆచార్య కె.శివశంకర్, తదితరులు హాజరయ్యారు.

Telangana University
Telangana University: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆవిర్భావ వేడుకలు
author img

By

Published : Jun 2, 2021, 2:34 PM IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(telangana formation day 2021) సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం(Telangana University)లో రాష్ట్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. మొదటగా వీసీ రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనందరం జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలాపించి గౌరవ వందనం చేశారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ సిబ్బందికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో తెలంగాణ అమరవీరుల త్యాగఫలితంగా రాష్ట్రం సిద్ధించిందని, వలస పాలన నుంచి విముక్తి లభించిందని ఉపకులపతి అన్నాపు. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థిక పరంగా, భౌగోళికంగా పరంగా తెలంగాణ ప్రత్యేకతను సంతరించుకున్నదని పేర్కొన్నారు.

సహజ వనరుల్లో తెలంగాణ ప్రముఖమైన స్థానాన్ని పొందిందని తెలిపారు. 60 ఏళ్ల సుధీర్ఘమైన పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రంగా అవతరించిందని గుర్తు చేశారు. తాను విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్​గా నియామకం పొందిన పది రోజూల్లోనే జాతీయ పతాకాన్ని ఎగురవేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నానని ఆయన వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ఆచార్య కె.శివశంకర్, ఆచార్య పి.కనకయ్య, డా.పాత నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ktr: అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.