భాజపా నాయకులు మతకల్లోలాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో సీట్లు గెలిచామని జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు మంచే చేస్తారని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంప్రాజెక్టు సరస్వతి కాలువ నుంచి యాసంగి పంటకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. జలాశయంలో నీరు సమృద్ధిగా ఉందన్న మంత్రి.. రైతులు త్వరగా నాట్లు ముగించాలని కోరారు.
గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న సీఎం కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. తెరాస కార్యకర్తలను రెచ్చగొడితే ఎవరూ మిగలరని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : వరంగల్ నగర అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష