నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. బాల్కొండలో భాజపా కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌తో ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండిః కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..