హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దారుణ హత్య చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థమవుతోందని తెలంగాణ భాజపా ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. నిజామాబాద్ కేంద్రంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వామన్‌రావు హత్య కేసులో కుంట శ్రీనుతో పాటు కొంత మంది పెద్దల హస్తం ఉందని ఎండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవుళ్ల విగ్రహాలపై దాడులు జరుగుతుంటే నాయకులు, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్ మేయర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆయన వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. షుగర్ ప్యాక్టరీకి సంబంధించిన 125 ఎకరాల భూమిని బోధన్ ఎమ్మెల్యే షకిల్ నకిలీ పట్టాలు సృష్టించి కబ్జా చేశారని విమర్శించారు. ఈ విషయమై తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'దొంగ పాస్‌పోర్టులపై పోలీసుల దృష్టి ఏది?'