నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పెండ సంజయ్ అనే విద్యార్థి ఆర్మూర్ సెయింట్ పాల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
స్టడీ అవర్‌లో హోం వర్క్ చేస్తుండగా అక్షరం సరిగా రాయలేదని స్కూల్ సెక్రెటరీ బబ్లూ సంజయ్‌ను చితక్కొట్టారు. వీపుపై కర్రతో కొట్టడం వల్ల విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
దాడి చేసిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బబ్లూ బెదిరంచగా.. సంజయ్ నోరు తెరవలేదు. చేతులపై వాతలు చూసిన తల్లి విజయ సంజ్ను ఆస్పత్రికి తీసుకెళ్లింది.
వైద్యుల పరీక్షలో సంజయ్‌ను ఎవరో చితకబాదారన్న విషయం బయటపడింది. విద్యార్థి తల్లి పాఠశాలకు వచ్చి తన కుమారుణ్ని పశువును బాదినట్లు బాదారని యాజమాన్యాన్ని నిలదీసింది.
ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యానికి, సంజయ్ తల్లికి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి తల్లి బబ్లూపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- ఇదీ చూడండి : పైశాచిక ఆనందంలో యువత