ఆధునాతన సాంకేతికతతోనే దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సుభాష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలకు సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకప్పుడు పాలిటెక్నిక్‌లో సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మాత్రమే ఉండేదని, మారుతున్న సాంకేతిక అభివృద్ధి వలన సమాజానికి ఎంతో ఉపయోగడే కోర్సులను ప్రవేశ పెట్టారని తెలిపారు.
ఈ కళాశాలలో చదివిన వారందరూ ఏ హోదాలో ఉన్నా దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభను చూపిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఇదీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'