ETV Bharat / entertainment

స్పై థ్రిలర్ కంటెంట్ కోసం చూస్తున్నారా? ఓటీటీలో ఈ సినిమాలు డోంట్​ మిస్! - SPY THRILLER SERIES IN OTT

ఓటీటీలో స్పై థ్రిలర్ కంటెంట్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!

Spy Thriller Series In OTT
Spy Thriller Series In OTT (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 10:30 AM IST

Spy Thriller Series In OTT : రీసెంట్‌గా రిలీజైన భారీ యాక్షన్ మూవీస్ మిమ్మల్ని నిరాశపరిచాయా? ఇంట్లో కూర్చొని ఎంటర్‌టైన్మెంట్ కోసం వెతుకుతున్నారా? బయటకు వెళ్లకుండా ఓటీటీల్లోనే యాక్షన్, థ్రిల్లర్ మూవీస్ / సిరీస్​లను చూడాలా? మీ కోసమే ట్రెండింగ్‌లో ఉన్న ఈ స్పై థ్రిల్లర్ మూవీల లిస్ట్​ను తీసుకొచ్చాం. చూసి ఎంజాయ్ చేయండి.

సిటాడెల్: హనీ బన్నీ
వరుణ్ ధావన్, సమంత లీడ్​రోల్ పోషించిన ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ప్రేరణగా తెరకెక్కించారు.రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో తన సొంత బ్యానర్ లో తెరకెక్కించింది. అజ్ఞాతంలో ఉంటున్న ఒక స్పై(సమంత), తన కూతురు చుట్టూ కథ తిరుగుతుంటుంది. చనిపోయిందనుకున్న భార్య బతికే ఉందని తెలియడంతో హీరో వరుణ్ ఆమెను కలిసేందుకు ప్రయత్నిస్తుంటాడు. వీళ్లతా అర్మార్డ్ అనే వస్తువు కోసం గాలిస్తుంటారు. దానిని చేజిక్కించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ సిరీస్.

తనావ్:
ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ సాధించిన వెబ్ సిరీస్ 'ఫౌదా'కు ప్రేరణగా వచ్చిందే ఈ 'తనావ్'. సోనీ లివ్ ఒరిజినల్ బ్యానర్‌లో ఇది తెరకెక్కింది. సుధీర్ మిశ్రా, సచిన్ కిషన్, ఇ.నివాస్ సంయుక్తంగా డైరెక్ట్ చేశారు. ప్రధాన పాత్రల్లో మానవ్ విజ్, సుఖమణ, రజిత్ కపూర్ నటించారు.

ముక్బిర్: ది స్టోరీ ఆఫ్ ఏ స్పై
పాకిస్థాన్​లో ఉండే ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ కథ ఇది. భారత్​ కోసం ఓ ఏజెంట్ చేసే సాహసాలను కళ్లకు గట్టినట్లుగా చూపించారు. డైరెక్టర్ శివమ్ నాయర్, జయప్రద్ దేశాయ్. ఇందులో ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ రాజ్, ఆదిల్ హుస్సేన్, జైన్ ఖాన్ నటించారు. జీ5 వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

స్పెషల్ ఓపీఎస్
నీరజ్ పాండే, శివమ్ నాయర్‌లు సంయుక్తంగా తెరకెక్కించిందే స్పెషల్ ఓపీఎస్. 19 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక వేటకు ముగింపు పలికే ప్రయత్నాన్ని ఇందులో చూపించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో దీన్ని రూపొందించారు. కరణ్ టక్కర్, వినయ్ పాఠక్, కేకే మీనన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

ది ఫ్యామిలీ మ్యాన్
హిందీతో పాటు తెలుగులోనూ సూపర్ సక్సెస్ సాధించిన సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. రెండు పార్టులుగా ఈ సిరీస్​ను తెరకెక్కించారు. మనోజ్ బాజ్​పాయ్, ప్రియమణి, షరీబ్ హష్మి లీడ్​ రోల్స్ పోషించారు. రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

క్రాక్ డౌన్
చాలా మంది భారత ప్రయాణికులు ఒక హైజాక్ ప్లాట్ ప్రమాదంలో పెడతాడు. ముగ్గురు రా ఏజెంట్స్ ఆ పరిస్థితిని చాకచక్యంగా హ్యాండిల్ చేస్తారు. ఇందులో ప్రధాన పాత్రల్లో షకీబ్ సలీమ్, శ్రియా పిల్గావ్కర్, అంకుర్ భాటియా కనిపించారు. అపూర్వ లఖియ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

ది ఫ్రీ లాన్సర్
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్​లో 'ది ఫ్రీలాన్సర్' ఒకటి. కథ మొత్తం టెర్రరిజం చుట్టూ తిరుగుతుంటుంది. భవ్ ధూలియా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్​ను డిస్నీ హాట్​స్టార్ తమ సొంత బ్యానర్​పై తెరకెక్కించింది.బార్డ్

బార్డ్ ఆఫ్ బ్లడ్
బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్​లో తెరకెక్కిన సిరీస్ 'బార్డ్ ఆఫ్ బ్లడ్'. వినీత్ కుమార్, శోభిత్ ధూళిపాళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. నెట్​ఫ్లిక్స్ సొంతగా నిర్మించిన ఈ షో వారి ఓటీటోలోనే స్ట్రీమింగ్ అవుతుంది. రిభు దాస్ గుప్తా, జయ్ దేవ్ బెనర్జీలు సంయుక్తంగా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

ది నైట్ మేనేజర్
అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'ది నైట్ మేనేజర్'. ఇందులో వీరు ఆయుధాల డీలర్ల పాత్రల్లో నటించారు. ఓ బ్రిటిష్​ షో ప్రేరణగా తీసిన ఈ సిరీస్‌ను సందీప్ మోదీ, ప్రియాంక ఘోష్ సంయుక్తంగా తెరకెక్కించారు. డిస్నీ+హాట్ స్టార్ వేదికగా ప్రస్తుతం ఇది స్ట్రీమింగ్ అవుతుంది.

థ్రిల్లర్ సినిమాల ఫ్యాన్స్ - ఈ 13 మూవీస్​ను అస్సలు మిస్​ అవ్వొద్దు! - Thriller Movies In OTT

'మీర్జాపుర్ 3' కంప్లీట్ చేశారా? ఈ క్రైమ్ థ్రిల్లర్స్​నూ చూసేయండి! - Crime Thrillers In OTT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.