ETV Bharat / health

బ్రెయిన్ షార్ప్​గా పనిచేయలా? ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే జెట్ స్పీడ్​తో దూసుకెళ్తుంది! - TIPS FOR MAINTAINING BRAIN HEALTH

-8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలని నిపుణుల సూచన -ఒకే చోట కూర్చోకుండా వాకింగ్, వ్యాయామం చేయాలట!

Tips for Maintaining Brain Health
Tips for Maintaining Brain Health (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Nov 17, 2024, 10:23 AM IST

Tips for Maintaining Brain Health: మానవ శరీరంలో అతి ముఖ్య అవయవం మెదడు. ఇది చురుకుగా ఆరోగ్యంగా ఉంటేనే.. మన శరీరం అనే యంత్రం సజావుగా నడుస్తుంది. అయితే, గాడి తప్పిన జీవనశైలి, తీరుతెన్నూ లేని ఆహారపు అలవాట్లు, అంతులేని ఒత్తిళ్లు, నిద్రలేమి, పొగ, మద్యం వంటి వ్యసనాలు మన మెదడును మొద్దుబారేలా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే మెదడును ఆరోగ్యంగా ఉంచే 5 సూత్రాలను ప్రముఖ న్యూరాలజీ వైద్యనిపుణులు డాక్టర్‌ ఇవాంజెలిన్‌ బ్లెస్సీ చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. 7-8 గంటల విశ్రాంతి తప్పనిసరి
    నిద్రతో మెదడుకు దగ్గరి సంబంధం ఉంటుందని ప్రముఖ న్యూరాలజీ వైద్యనిపుణులు డాక్టర్‌ ఇవాంజెలిన్‌ బ్లెస్సీ చెబుతున్నారు. నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకుంటుందని.. ఆ సమయంలోనే జ్ఞాపకాలు పదిలంగా నిక్షిప్తమవుతాయని వివరించారు. కనీసం 7 గంటలు నిద్రపోకపోతే జ్ఞాపకశక్తి ప్రభావితం అవుతుందని వెల్లడించారు. ఏ విషయాన్నీ సరిగా గుర్తుంచుకోలేక.. దేనిపైనా ఏకాగ్రత కుదరక రోజంతా చికాకుగా ఉంటుందని అంటున్నారు. ఫలితంగా సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. పెద్ద వయస్కులకు రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలని.. అదీ రాత్రి సమయంలోనే నిద్రపోవాలని సూచిస్తున్నారు. అంతరాయం లేకుండా కనీసం 7 గంటలు నిద్రిస్తే.. మెదడే కాదు శరీర భాగాలన్నీ పునరుత్తేజం అవుతాయన్నారు. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల నిద్రలేమితో భవిష్యత్తులో హైపర్‌టెన్షన్, గుండెవ్యాధులు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదాలు ఎక్కువని హెచ్చరించారు.
  2. ఒత్తిడిని దరి చేరనివ్వద్దు
    అనవసరమైన విషయాల్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి గురికావడం వల్ల మెదడులోని కణాలు చనిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని వివరించారు. చాలామంది అనారోగ్యంగా ఉన్నా సరే.. పనిలో నిమగ్నమైపోతుంటారు. అయితే, ఇలా అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడు దాన్ని తగ్గించే పనిలో తలమునకలై ఉంటుందని.. అందుకే నలతగా ఉన్నప్పుడు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తుంటారు. లేదంటే మెదడు తీవ్ర ఒత్తిడికి లోనై.. దీర్ఘకాలిక దుష్ప్రభావాలు తలెత్తుతాయని చెబుతున్నారు. శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సమయం ఒకేచోట కూర్చోవడమూ ఒత్తిడికి కారణమవుతుందని.. దీంతో ఊబకాయం, గుండెవ్యాధులే కాకుండా మెదడూ నిస్సత్తువగా మారుతుందని అంటున్నారు. అందుకే నిత్యం వ్యాయామం చేయాలని.. తదేకంగా కూర్చొని పనిచేసేవారు అరగంటకోసారి లేచి కొద్దిసేపు నడవాలని సూచిస్తున్నారు. వారంలో కనీసం 3 రోజులైనా అరగంట చొప్పున నడవడం, జాగింగ్‌ చేయడం వల్ల మెదుడు చురుకుగా స్పందిస్తుందని తెలిపారు.
  3. సెల్‌ఫోన్‌ స్క్రీనూ శత్రువే..!
    ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. స్క్రీన్‌టైమ్‌ ఎక్కువగా ఉండటం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. తప్పనిసరిగా స్క్రీన్‌ ఎక్కువ సమయం చూడాల్సినవారు ఆ తెర నుంచి ఇబ్బంది కలగకుండా కళ్లద్దాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. చిన్న పిల్లలు, యువకులూ ఎక్కువసేపు ఫోన్లు వాడటం వల్ల ఆ కిరణాలు కంటిపై పడి తలనొప్పితో బాధపడతున్నారని వైద్యనిపుణులు అంటున్నారు. ఫోన్‌ వాడేటప్పుడు 30 డిగ్రీల కంటే మించి తల కిందకు వంచకూడదని చెబుతున్నారు. మొబైల్‌ తెర ఎంతసేపు ఆన్‌లో ఉందని ఫోన్‌లో ‘డిజిటల్‌ వెల్‌బీయింగ్‌’ అనే ఆప్షన్‌తో తెలుసుకోవచ్చని వివరించారు. ఆ ఆప్షన్‌ ద్వారా మనం రోజూ ఫోన్‌ ఎంతసేపు వాడుతున్నాం? ఏ యాప్‌ ఎక్కువగా వినియోగిస్తున్నాం? అనే విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడవచ్చని అంటున్నారు.
  4. హెడ్‌ఫోన్లతో మోతే..!
    సురక్షిత స్థాయుల్లో శబ్దాలు వినకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది యువత వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)అంచనా వేసింది. గంటసేపు పెద్ద శబ్దం పెట్టుకొని ఎయిర్‌పాడ్స్‌, హెడ్‌ఫోన్లు వాడటం వల్ల మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని నిపుణులు అంటున్నారు. హెడ్‌ఫోన్ల శబ్దాలు 60% కంటే ఎక్కువైతే.. మెదడు సాధారణ స్థితికి దూరమవుతుందని.. మళ్లీ మామూలు స్థాయికి రావాలంటే ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏకాగ్రత లోపించడమే కాకుండా.. పెద్దగా సౌండ్‌ పెట్టుకొని ధ్వనులు వినటం వల్ల వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. పెద్ద వయసులో వినికిడి సామర్థ్యం దెబ్బతింటే తిరిగి మామూలు స్థితికి రావడం కష్టమని.. ఇది నేరుగా మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.
  5. తియ్యనైన శత్రువు
    ఇవే కాకుండా తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మెదడు పనితీరు ప్రభావితం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రాసెస్‌ చేసిన ఆహారంతో ప్రతికూలతలు ఉంటాయని వివరించారు. ఫ్రక్టోజ్‌ స్థాయి ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి వేస్తుందని.. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదముందని పేర్కొన్నారు. కాలేయ క్యాన్సర్‌కు తియ్యటి పదార్థాలూ కారణమేనని.. ఇలాంటి ఆహారాలు మెదడు ఆలోచనా సామర్థ్యాన్ని, చురుకుదనం కోల్పోయేలా చేస్తాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం చక్కర స్థాయి ఎక్కువగా ఉండే పానీయాలను వారానికి 200-355 మి.లీ. మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రక్తం​తో మెడిసిన్ తయారీ! బోన్ ఫ్యాక్చర్స్, గాయాలకు ఇకపై ఈజీ ట్రీట్​మెంట్!

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగితే గుండె జబ్బులు రావట! ఇన్ని లాభాలని తెలిస్తే రేపటి నుంచే స్టార్ట్ చేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.