నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. ఖాజాపూర్, హున్సా, మందర్నాలో చెరుకు, వరి, సోయా, మొక్కజొన్న ఈదురుగాలులతో కిందపడిపోయాయి. బోధన్ మండలం మంజీర నదికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ అన్ని అరుతడి పంటలను పండిస్తారు. చెరుకు, సోయా, కందులు, తొగరి పంటలను అధికంగా వేస్తారు. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అన్ని పంటలు నెలరాలయి. ఖాజాపూర్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోండడం వల్ల పక్కనున్న పంటలన్నీ నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీట మునగడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: అలుగు దూకిన కొత్తచెరువు.. నీట మునిగిన రోడ్లు!