ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తమ గ్రామానికి బస్ రావడం లేదని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి విద్యార్థులు బోధన్ డిపో మేనేజర్ కు పువ్వులు ఇచ్చి తమ సమస్యను తెలిపారు. గ్రామం నుంచి సుమారు యాబై మంది విద్యార్థులు మంగల్ పహాడ్, ఎడపల్లి, బోధన్ కి చదువుకోవడం కొరకు వస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా 45 రోజులుగా తమకు బస్ రాకపోవడంతో ఆటోలకు ఇంట్లో డబ్బులు ఇవ్వలేకపోతున్నారని, దాంతో ఒకరోజు పాఠశాలకు వెళ్తే ఇంకోరోజు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు. బోధన్ డిపో మేనేజర్‌కు పువ్వులు, వినతిపత్రం ఇచ్చి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు