ETV Bharat / state

ఆసుపత్రి ముందు విద్యార్థి సంఘాల ఆందోళన

అనవసర వైద్య పరీక్షలు చేస్తూ... ఆసుపత్రి యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని కుమురం భీం ఆసిఫాబాద్​లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధితులకు న్యాయ చేయాలని డిమాండ్ చేశారు.

ఆసుపత్రి ముందు విద్యార్థి సంఘాల ఆందోళన
author img

By

Published : Nov 23, 2019, 6:23 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అవసరం లేకపోయినా... పరీక్షల పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇద్దరు రోగులకు స్థానికంగా ఓ​ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. మరో ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే డెంగీ లేదని తేలింది. దీంతో రోగుల కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు నిర్వహించిన ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి.

బాధితులకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని రోగుల కుటుంబసభ్యులు, విద్యార్థి నాయకులు భీష్మించుకూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్​కు తరలించారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని ఆందోళన విరమింపజేశారు.

Intro:సంపాదనే ధ్యేయంగా ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు అక్రమాలకు పాటుపడుతూ ప్రజల వద్ద నుండి భారీ స్థాయిలో డబ్బులు లాగుతున్నారు. లేని రోగాలను అంటగడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగుల వద్ద నుండి భారీ స్థాయిలో అవసరం లేకపోయినా పరీక్షల పేరిట వేల రూపాయలు లాగుతున్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వివరాలు నమోదు అవుతుండడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులు దాదాపు ప్రతి 100 మంది రోగుల్లో 80 మందికి dengue సోకినట్లు, రక్త పరీక్షలు నిర్వహించి రోగుల నుండి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అనవసరంగా లేని వ్యాధులను రోగాలను అంటగడుతూ ట్రీట్మెంట్ పేరిట ఆసుపత్రులలో ఇన్ పేషెంట్గా ఉంచుకుంటూ లక్షల రూపాయలు బిల్లులు వసూలు చేస్తున్నారు. ఆసిఫాబాద్ లో ఉన్నటువంటి కేర్ ఆస్పత్రిలో ఇద్దరు రోగులకు డెంగ్యూ జ్వరం లేకున్నా dengue ఉన్నట్లు రక్త పరీక్ష నిర్వహించి నిర్ధారించారు. ఆ రోగులు ఇతర ఆసుపత్రులలో రక్త పరీక్షలు నిర్వహిస్తే డెంగ్యూ లేదని తెలిపారు. కుటుంబ సభ్యులు కేర్ ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తూ తప్పుడు రిపోర్టులు ఇస్తూ రోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ అనవసరమైన ట్రీట్మెంట్ లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బాధితులు కేర్ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. బాధితులకు తగు న్యాయం చేసే వరకు ఆసుపత్రి ముందు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఇట్టి విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనను అడ్డుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన ఆపేశారు. బాధితుల నుండి ఫిర్యాదు తీసుకొని వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా

Body:tg_adb_25_23_hospital_mundara_andolana_avb_ts10078

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.