నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఊట్పల్లిలో సురేందర్, ఉమ వారి కుమార్తె పల్లవి నివాసముంటున్నారు. లాక్డౌన్ సమయంలో బోధన్‌కు చెందిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు ఊట్పల్లి గ్రామానికి వెళ్లి పల్లవిని తమ పాఠశాలలో చేర్పించండి అని అభ్యర్థించారు.
తల్లిదండ్రులు బాలికను స్కూలులో చేర్చి... ఆన్‌లైన్ తరగతుల కోసం ఫోన్ కూడా కొన్నారు. ఇన్ని రోజులు క్లాసులు విన్న బాలికకు ఇప్పుడు ప్రవేశం లేదని చెప్పారు. మనస్తాపానికి గురైన ఉమ.. కూతురుతో కలసి పాఠశాల ముందు బైఠాయించింది. తమ బిడ్డ చదువుకోవడానికి సీటు ఇప్పించి.. సహాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: ఇంకా సవాళ్ల మధ్యే 'ఆన్‌లైన్' అభ్యసనం!