ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతోంది. నిత్యావసర సరకులు, కూరగాయల కోసం మధ్యాహ్నం ఒంటి గంట వరకే అనుమతి ఉంది. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల నుంచి కొత్త కేసులు రాలేదు. రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో చర్చించారు.
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇందల్వాయి టోల్ ప్లాజాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా కట్టడి చర్యలను పరిశీలించారు. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో ని కొనుగోలు కేంద్రాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలు పరిశీలించారు.
కామారెడ్డి జిల్లాలో పది రోజుల నుంచి కొత్త కేసులు రాలేదు. మద్నూర్ మండల కేంద్రంలో కొవిడ్‌ను నియంత్రించాలని పోచమ్మ గుడిలో భక్తులు పూజలు చేశారు. రెండు జిల్లాల్లోని రెడ్ జోన్ ప్రాంతాల్లో కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'వేసవిలో భారత్ కరోనాను జయించొచ్చు!'