తమిళనాడులో పసుపు బోర్డు ఏర్పాటు ఎలా సాధ్యం.. ఇక్కడ ఎందుకు సాధ్యం కాదో ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రాజీనామా చేయాలన్నారు. తమిళనాడు ఎన్నికల్లో భాగంగా భాజపా మేనిఫెస్టోలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఎంపీ అర్వింద్ రాజీనామా చేసి పసుపు బోర్డు, మద్దతు ధర కోసం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టాలని సూచించారు. పసుపు రైతుల సంక్షేమం కోసం ఉద్యమం చేయాలని ఎంపీని కోరారు.
ఇదీ చదవండి: ధాన్యం కొనుగోళ్ల కోసం బ్యాంకు పూచీకత్తు: మంత్రి నిరంజన్‌రెడ్డి