భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన నిజామాబాద్ వాసి జవాను ర్యాడ మహేశ్(Martyr Soldier Mahesh) కుటుంబానికి సర్కారు భరోసానిచ్చింది. ఆయన కుటుంబానికి రూ. 50లక్షలు, 300 గజాల ఇంటి స్థలం, మహేశ్ భార్యకు రిజిస్ట్రేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కేటాయించింది.
మహేశ్(Martyr Soldier Mahesh) గతేడాది నవంబరు 8వ తేదీన దేశ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ అమరుడయ్యారు. నేడు ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా మహేశ్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లిలో జవాను విగ్రహాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా యువకులు వేల్పూర్ నుంచి కోమన్‌పల్లి వరకు ర్యాలీగా తరలివచ్చారు. అమర్ రహే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అనంతరం మహేశ్(Martyr Soldier Mahesh) కుటుంబసభ్యులకు ప్రభుత్వం అందించిన సహాయానికి సంబంధించి పత్రాలను మంత్రి అందించారు.
సైనికుల త్యాగానికి వెల కట్టలేమని.. కానీ వారి కుటుంబానికి(Martyr Soldier Mahesh) అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, సమాజంపై ఉందని మంత్రి అన్నారు. దక్షిణాది నుంచి ఆర్మీలోకి ఎక్కువగా చేరికలుండాలంటే అమర జవానుల కుటుంబాలకు భరోసా ఇవ్వటం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహేశ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థుల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: CM KCR: నాకు సమాధానం కావాలి... అప్పటివరకు భాజపాను వదిలిపెట్టను: కేసీఆర్